బాస్కెట్బాల్ క్రీడాకారిణి పుష్ప సెంథిల్ కుమార్ స్ఫూర్తిదాయక ప్రయాణం

రిపోర్టర్: నరేష్ స్థలం: Bengaluru

తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన భారత బాస్కెట్బాల్ క్రీడాకారిణి పుష్ప సెంథిల్ కుమార్ తన ప్రయాణంపై స్పందించారు. తనకు కోచ్ల నుంచి లభించిన మద్దతుతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆమె వెల్లడించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ రైల్వే ఉద్యోగం సాధించి, క్రీడల ద్వారా కుటుంబానికి అండగా నిలిచానని పుష్ప సెంథిల్ కుమార్ గర్వంగా తెలిపారు.