బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కలకలం ఆర్టీవో సహా ముగ్గురి సస్పెన్షన్
రిపోర్టర్: రాము
స్థలం: బండ్లగూడ
బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కానిస్టేబుల్ నగదు లెక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన రవాణా శాఖ కమిషనర్, ఆర్టీవో రాంచందర్ నాయక్, ఎంవీఐ భీమ్‌సింగ్ మరియు డబ్బులు లెక్కించిన కానిస్టేబుల్ అరుణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.