భీమవరంలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: హరి స్థలం: భీమవరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోదీ ఇరవై ఐదు ఏళ్ల ప్రజాసేవను స్మరించుకుంటూ ఒకే వేదికపై ఇరవై ఐదు వేల ఆశీర్వాద దీపాలు వెలిగించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.