భోగాపురం ఎయిర్పోర్టులో పట్టుబడ్డ రూ నాలుగు కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భోగాపురం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగుల్లో రూ.4 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి గంజాయిని సీజ్ చేశారు. నిందితుడు కోల్కతాకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్గా డీఆర్ఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం.