మడమనూరులో ఎస్ఎంసి పాఠశాలల ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో ఐదు పాఠశాలల ఎస్ఎంసి ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. టీడీపీ నాయకులు నూని లక్ష్మయ్య, కొడతా విజయ్, మాజీ ఉప సర్పంచ్ సుధీర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. వివిధ పాఠశాలలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో స్థానిక టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.