ఉపాధ్యాయులపై వైకాపా శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రులు మరియు సంఘాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
విజయవాడలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఉపాధ్యాయులపై వైకాపా నాయకులు, గూండాలు దాడికి దిగడంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై, వైకాపా అరాచకాలపై మంత్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సోమవారం ఎక్స్ వేదికగా గురువులు వర్సెస్ వైకాపా గూండాలు హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ, ఏపీటీఎఫ్, టీఎన్‌యూఎస్ సంఘాల నేతలు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.