వైకాపాలో తీవ్ర కలకలం: బడ్డుకొండ అప్పలనాయుడు సస్పెన్షన్తో భగ్గుమన్న అసంతృప్తి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును వైకాపా నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన మద్దతుదారులు, శనివారం విజయనగరంలో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారీ ఎత్తున వైకాపాకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల వేళ వరుస పరిణామాలు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం ఆందోళన చెందుతోంది.