ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం, నిద్రపోతున్న యువకుడిని ఢీకొట్టిన ట్రక్కు

రిపోర్టర్: శివ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని దహిసర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల మంజిత్ యాదవ్ మృతి చెందాడు. చెట్టు కింద నిద్రపోతున్న యువకుడి పైకి ట్రక్కు వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.