తెరాస కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల కుమ్మక్కు రాజకీయాలపై బీజేపీ ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. పైకి వేరుగా కనిపిస్తున్నా తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు లోలోపల ఒక్కటేనని విమర్శించింది. భిన్న పార్టీలుగా ముఖం చూపించినా ఈ ముగ్గురు మిత్రుల సిద్ధాంతాలు, బుజ్జగింపులు, సూడో సెక్యులర్ రాజకీయాలు ఒక్కటేనంటూ బీజేపీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు.