సమృద్ధిగా వర్షాలు కురవాలి: భుజంగేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
రైల్వేకోడూరు శ్రీ భుజంగేశ్వరస్వామి దేవస్థానంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నేతలు ముక్కా రూపానందరెడ్డి తదితరులు పాల్గొని స్వామివారిని వేడుకున్నారు.