సర్వభూపాల వాహనంపై వైభవంగా విహరించిన కల్యాణ వెంకన్న

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు సర్వభూపాల వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీసమేతంగా ఈ వాహన సేవలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి సారె సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఈ వేడుకలతో తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.