నేడు తుమ్మలగుంటలో వైభవంగా గరుడోత్సవ వేడుకలు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. అదే రోజు రాత్రి గరుడ వాహనంపై కల్యాణ వెంకన్న మలయప్ప స్వామిగా పురవీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఈ గరుడోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో తుమ్మలగుంటలో గరుడసేవ సందడి నెలకొంది.