పలాస మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మహిళలు, యువతను కలుస్తూ తమ పార్టీ విధానాలను వివరిస్తూ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.