కావలిలో దారుణం: అనుమానంతో భార్యను కత్తితో గొంతు కోసి హతమార్చిన భర్త
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
భార్య ప్రవర్తనపై అనుమానంతో కట్టుకున్న భర్తే ఆమెను కత్తితో దారుణంగా హతమార్చిన ఘటన కావలి మండలంలోని రుద్రకోట ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. కావలి గ్రామీణ స్టేషన్ సీఐ గుడి రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ఏడుకొండలు తన భార్య మానేపల్లి సుబ్బులును ఊరి చివరకు తీసుకెళ్లి మెడపై కత్తితో కోసి చంపేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.