నాసిక్ గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధికారుల చర్చలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Nashik, Maharashtra
మహారాష్ట్రలోని నాసిక్‌లో గిరిజన విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు గిరిజన అభివృద్ధి శాఖతో నిరంతరం చర్చిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మంత్రి స్వయంగా విద్యార్థులతో టచ్‌లో ఉన్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఆందోళన విరమించాలని అధికారుల బృందం కోరుతోంది.