ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అల్లూరి సీతారామరాజు

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు హెచ్చరించారు. క్యూవీఎస్‌ఈ ట్రేడింగ్ యాప్ ద్వారా మోసపోయిన బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఇప్పుడు అపోలో ట్రేడింగ్ యాప్ పేరుతో కొత్త మోసాలకు తెరతీస్తున్నట్లు తెలిపారు. పాత డబ్బులు తిరిగి వస్తాయని నమ్మి మోసగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.