వైమానిక విన్యాసాలు: స్వయంగా విమానం నడిపి జపాన్‌కు వెళ్లిన థాయ్‌లాండ్ రాణి సుతిద
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Bangkok
థాయ్‌లాండ్ రాణి సుతిద మరోసారి తన విమానయాన ప్రతిభను చాటుకున్నారు. థాయ్‌లాండ్ విమానాశ్రయం నుంచి జపాన్‌కు తాను స్వయంగా రాజ విమానాన్ని నడిపినట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు పద్నాలుగో తేదీన జపాన్‌లోని హోక్కైడో విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. అంతర్జాతీయ ఐస్ హాకీ సమాఖ్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తొమ్మిది రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు వెళ్లినట్లు తెలిపారు. గతంలో సుతిద ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన విషయం తెలిసిందే.