తెదేపాతోనే బలహీనవర్గాలకు రాజకీయ స్వాతంత్ర్యం: మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం
రిపోర్టర్: వెంకట్
స్థలం: పశ్చిమగోదావరి
తెలుగుదేశం పార్టీతోనే బడుగు, బలహీనవర్గాలకు నిజమైన రాజకీయ స్వాతంత్ర్యం లభిస్తుందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న ఘనత వైకాపాదేనని ఆయన ధ్వజమెత్తారు.