రేపాక పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అడ్డగూడూరు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ రామన్నపేట ఆధ్వర్యంలో రేపాక ఉన్నత పాఠశాలలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవాలని, బాల్య వివాహాలు, డ్రగ్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో టోల్ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని తెలిపారు.