రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ అడ్వకేట్ వెంకటేశ్వర్లు పాదయాత్ర కొనసాగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: బూందీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుతూ ఏపీ హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర రాజస్థాన్లోని బూందీకి చేరుకుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో ఇప్పటివరకు సుమారు రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు నడిచానని, రాహుల్ స్ఫూర్తితోనే ఈ సాహస యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నానని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యాత్రకు ఘన స్వాగతం పలికారు.