ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ భారీ నిరసన ప్రదర్శన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
ఓట్ల చోరీ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ న్యూఢిల్లీలో పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ నిరసన మార్చ్ చేపట్టామని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళం వినిపించారు.