ఎచ్చెర్లలో బోల్తా పడ్డ వ్యాన్ పదహారు మంది కార్మికులకు తీవ్రగాయాలు
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎన్హెచ్-16పై కింతలమిల్లి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న హైవే కార్మికుల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడటంతో పదహారు మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.