పాల్వంచ కాలనీ గుట్ట సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించిన వైనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాల్వంచ
పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలో పన్నెండు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. అటవీ అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ టీమ్ దానిని చాకచక్యంగా పట్టుకుంది. కొండచిలువను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.