మోదీని గద్దె దించేందుకు వానర సేన సిద్ధం: రేవంత్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఓటర్ల జాబితా సవరణ పేరిట కోట్లాది ఓట్లను తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల హక్కులను కాలరాస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోదీ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.