యువతకు ఉపాధి కల్పిస్తున్న పారాది సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లు

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామ జెడ్పీ హైస్కూల్ వేదికగా పదమూడవ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీలకు ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. క్రీడారంగానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, స్పోర్ట్స్ కోటా ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నాయకులు తెలిపారు.