క్రీడాకారుల ఉద్యోగాలపై అజ్ఞానంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

పారాదిలో జరుగుతున్న సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయనే కనీస జ్ఞానం లేక జగన్ విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. క్రీడా కోటా కింద ఉద్యోగాలు పొందిన వారికి అన్ని నిబంధనల ప్రకారమే సర్టిఫికెట్లు జారీ చేశామని, అర్హులైన యువతకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.