యూఏఈలో ప్రవాస భారతీయుడు ఉడిపి వాసి అల్విన్ హత్య

రిపోర్టర్: సునీల్ స్థలం: ఉడిపి

యూఏఈలో ప్రవాస భారతీయుడైన అల్విన్ ప్రకాష్ కుందర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని తొమ్మిది భాగాలుగా నరికి రెండు బ్యాగుల్లో కుక్కినట్లు సోదరుడు అనీల్ ప్రశాంత్ కుందర్ తెలిపారు. ఉడిపికి చెందిన అల్విన్ దుబాయ్ లో పనిచేస్తుండగా జూలైలో ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య, కుమారుడు కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.