సోషల్ మీడియా దుష్ప్రచారంతో రగిలిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి పట్టణంలోని పవిత్ర దేశమ్మ దేవాలయంలో టికెట్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న మోహనకృష్ణ మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెట్టి పరువుకు భంగం కలిగించారని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో మునికృష్ణమూర్తికి వారు ఫిర్యాదు అందజేశారు. సస్పెన్షన్లో ఉన్న అతనికి నిబంధనలకు విరుద్ధంగా విధులు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.