రైలు ప్రయాణికుడి బంగారం అపహరించిన ఇద్దరు బెడ్‌రోల్ అటెండర్ల అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: సికింద్రాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుడికి చెందిన 22 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, డైమండ్ పెండెంట్‌ను అపహరించిన ఇద్దరు బెడ్‌రోల్ అటెండర్లు రాహుల్ కుమార్, సురేష్ పాశ్వాన్‌లను సోమవారం సికింద్రాబాద్ జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.