కల్లూరు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కల్లూరు
కల్లూరు మండలంలో కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువు అలుగు ఉద్ధృతి భారీగా పెరిగింది. దీంతో రాళ్లబంజర, బోడిమల్లె గ్రామాలకు వెళ్లే మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాలను అడ్డుగా ఉంచి రాకపోకలను నియంత్రించినట్లు తెలిపారు. ఉద్ధృతి తగ్గే వరకు ప్రజలు ప్రయాణించవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ కొందరు అలుగు దాటేందుకు సాహసిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.