యువ వ్యాపారవేత్త స్ఫూర్తి: రెండు నిమిషాల్లో ఈ-కామర్స్ వెబ్సైట్ సృష్టి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

లక్షల వేతనం వదులుకుని సొంత గడ్డపై ఎదిగిన విశాఖ యువ వ్యాపారవేత్త విశ్వతేజ మై షాప్జీ ప్లాట్ఫామ్తో చిన్న, మధ్య తరహా వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని హైట్స్ ప్రైవేట్ నిర్వాహకులు తెలిపారు. పదేళ్ల సాఫ్ట్వేర్ అనుభవాన్ని పక్కనపెట్టి కేవలం రెండు నిమిషాల్లోనే సొంత వెబ్సైట్ సృష్టించే టెక్నాలజీని తీసుకువచ్చారు. తక్కువ ఖర్చుతో ఆన్లైన్ వ్యాపారం చేసుకునేలా వ్యాపారులకు మార్గం సుగమం చేశారని తెలిపారు.