తెలంగాణలో భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్: తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో భూభారతి వెబ్సైట్ మొరాయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మీ సేవా నిర్వాహకులు తెలిపారు. గడిచిన మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో పాటు ఎర్రర్ సమస్యలు వస్తున్నట్లు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల సమయంలో తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.