డ్యూ డేట్ సినిమా షూటింగ్ ప్రారంభం: హైదరాబాద్‌లో ఘనంగా రెగ్యులర్ షెడ్యూల్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్గా ఆనంద్.కె దర్శకత్వంలో వస్తున్న సరికొత్త చిత్రం 'డ్యూ డేట్' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కుతోందని, నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే బర్నింగ్ ఇష్యూ ఆధారంగా ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.