భగత్‌సింగ్‌ త్యాగం చిరస్మరణీయం:కార్తీక్ గౌడ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సంస్థాన్ నారాయణపూర్

సంస్థాన్ నారాయణపూర్లో భగత్సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ల కార్తీక్గౌడ్ భగత్సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే భగత్సింగ్ చేసిన త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు.