తిరుమలలో భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులకు స్మార్ట్ టెక్నాలజీ
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. కొండపై ఉచితంగా నడిపే ఎలక్ట్రిక్ ధర్మ రథం బస్సులకు కొత్త స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ప్రధాన ఇరవై బస్టాప్‌లను స్మార్ట్ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా బస్సు వచ్చే సమయం, రూట్‌మ్యాప్‌ను భక్తులు సులభంగా తెలుసుకోవచ్చని వెల్లడించారు. త్వరలో ఆర్టీఏ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ప్రతి మూడు నిమిషాలకొక బస్సు అందుబాటులోకి రానుంది.