అనకాపల్లి రోడ్డు అభివృద్ధి పనులపై పంచకర్ల రమేష్ బాబు కీలక డెడ్లైన్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి నుండి లంకెలపాలెం వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించి, రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.