పౌర సేవల్లో కీలక మైలురాయి: నూతన సెక్యూరిటీ పేపర్ ప్రారంభించిన మంత్రి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో పౌర సేవలను మరింత సురక్షితంగా మార్చేందుకు మీసేవ కేంద్రాల ద్వారా అందించే ధ్రువపత్రాల కోసం అత్యాధునిక భద్రతా కాగితాన్ని ప్రవేశపెట్టినట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నూతన సెక్యూరిటీ పేపర్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నకిలీలను అడ్డుకోవడంతో పాటు సర్టిఫికెట్ల మన్నికను పెంచేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.