కోర్టులో దుస్తులపై న్యాయమూర్తి వ్యాఖ్యానించారన్న క్రిమినల్ లాయర్ మరియా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Texas
టెక్సాస్‌లో క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా పనిచేస్తున్న మరియా మెదినా ధరించిన దుస్తులపై స్థానిక కోర్టు జడ్జి యోలందా హఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఆమె ధరించిన దుస్తులు కోర్టుకు తగినవి కాదంటూ జడ్జి ప్రశ్నించినట్లు మరియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను వేసుకున్నది షిఫ్ట్ డ్రెస్ అని, గతంలోనూ అనేకసార్లు దీన్ని ధరించానని ఆమె స్పష్టం చేశారు. అయితే కోర్టు నిబంధనలను గౌరవిస్తానని, భవిష్యత్తులో బ్లేజర్ ధరిస్తానని ఆమె పేర్కొన్నారు.