అరబ్ రీడింగ్ ఛాలెంజ్ విజేతగా నిలిచిన పదకొండేళ్ల విద్యార్థినికి అరుదైన గౌరవం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Dubai
అరబ్ రీడింగ్ ఛాలెంజ్ పదవ ఎడిషన్‌లో అరవై దేశాల నుంచి నలభై మిలియన్లకు పైగా విద్యార్థులను వెనక్కి నెట్టి ఈజిప్ట్‌కు చెందిన పదకొండేళ్ల మేయార్ ఉత్మాన్ అల్ షోర్బాగి విజయగా నిలిచారని గల్ఫ్ న్యూస్ తెలిపింది. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆమెను ఆప్యాయంగా అభినందించి తన బ్యాచ్‌ను బహూకరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని నిర్వాహకులు వెల్లడించారు.