అర్జెంటీనా తీరంలో సముద్రం వెనక్కి వెళ్లడంపై వైరల్ నిజాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
అర్జెంటీనా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం రాత్రికి రాత్రే వెనక్కి వెళ్లిందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై స్పష్టత వచ్చింది. ఇది విపత్తు కాదని, బలమైన గాలుల కారణంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల తాత్కాలికంగా చోటుచేసుకున్న సహజసిద్ధ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు తేల్చేశారు. కొద్ది గంటల్లోనే నీటిమట్టం సాధారణ స్థితికి చేరుకుందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.