మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి ఇద్దరు మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Moscow
రష్యా పార్లమెంట్ ఎన్నికల చివరి దశ పోలింగ్ జరుగుతున్న వేళ ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. రాత్రికి రాత్రే రాజధాని మాస్కో లక్ష్యంగా వెయ్యికిపైగా డ్రోన్లను ప్రయోగించడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. మాస్కో చరిత్రలోనే ఇది అతిపెద్ద డ్రోన్ దాడి అని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఓ ఆయిల్ రిఫైనరీతో పాటు నివాస భవనం దెబ్బతిన్నాయి.