తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు

రిపోర్టర్: గోపి స్థలం: Prakasam

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మురాసు తుఫాను తాకిందని, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన ఈ తుఫాను కారణంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు హెచ్చరించారు.