యువ క్రీడాకారుల కోసం అండర్-14 క్రికెట్ ఎంపిక పోటీలు

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-14 క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు జరుగనున్నాయి. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ మైదానంలో ఉదయం పది గంటలకు సెలక్షన్స్ ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులతో ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పోటీలు నిర్వహించి, ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్-14 అధికారిక జట్టును ఎంపిక చేయనున్నారు.