కుమారుల నుంచి ప్రాణహాని ఉందంటూ జగిత్యాల కలెక్టర్ ఎదుట వృద్ధ దంపతుల ఆవేదన

రిపోర్టర్: నరేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన నల్లగంగారాం దంపతులు తమ కుమారుల నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ప్రశాంతంగా బతికేందుకు తమకున్న భూమిని విక్రయించాలనుకుంటే కుమారులు అడ్డుపడుతున్నారని వాపోయారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారు జగిత్యాల కలెక్టర్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.