అరుణాచల కొండల పరిరక్షణకు రంగంలోకి దిగిన తమిళనాడు సర్కార్
రిపోర్టర్: గోపి
స్థలం: తమిళనాడు
ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భక్తుల రక్షణ కోసం గ్రీన్ తమిళనాడు మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్లు, స్కానర్లు, ఉపగ్రహ చిత్రాల సహాయంతో కొండ లోపలి పరిస్థితులపై అధ్యయనం చేసింది. తిరువణ్ణామలైతో పాటు తూర్పు కనుమల్లోని తొమ్మిది జిల్లాల్లో సహజ వాతావరణాన్ని పరిరక్షించేందుకు మరియు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.