UGC-NET పునర్ పరీక్షపై ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
UGC-NET ఇంగ్లీష్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న NTA నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఈ నిర్ణయం ఏకపక్షమని, నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ పారుల్ షియోరాన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, NTAలకు జస్టిస్ జస్మీత్ సింగ్ నోటీసులు జారీ చేశారు. పరీక్షా ఫీజు వాపసుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేశారు.