రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు దూదివెంకటాపురం విద్యార్థుల ఎంపిక
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఎదుల వివేక్, ఎర్రోళ్ల రాహుల్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సెలెక్షన్స్ లో ప్రతిభ చాటిన వీరు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు సుంచు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.