హర్యానాలో విషాదం: ముగ్గురు పిల్లలను ఉరితీసి తల్లి ఆత్మహత్య
రిపోర్టర్: నరేష్
స్థలం: Sonipat
హర్యానాలోని సోనిపట్ జిల్లా ముద్లానా గ్రామంలో ముగ్గురు పిల్లలను ఉరితీసి, తాను కూడా విషం తాగి వివాహిత రీమా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. శనివారం జరిగిన ఈ ఘోర ఘటనలో పదకొండేళ్ల రిహానా, ఏడేళ్ల అర్జుు, నాలుగేళ్ల దుష్యంత్ ప్రాణాలు కోల్పోయారు. ఉపాధ్యాయుడైన భర్త జైదీప్ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని, నలుగురి మృతదేహాలను ఖాన్పూర్ కలాన్ వైద్య కళాశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారులు వెల్లడించారు.