తపాలాపూర్లో రాకపోకలు నిలిపివేసి ఘనంగా సాగుతున్న సాంప్రదాయ ఊరు కట్టడి

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఊరు కట్టడి కార్యక్రమం రెండో రోజు అయిన గురువారం కూడా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రామ పెద్దలు, ప్రజలు ఉదయం డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఊరు కట్టడి కార్యక్రమం ఉంటుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.