ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు వజ్రఖచిత స్వర్ణ కిరీటం కానుక

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు రూ. 76 లక్షల విలువైన వజ్రఖచిత స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. మొదట రూ. 50 లక్షలు అనుకున్నప్పటికీ, అత్యున్నత ప్రమాణాలతో నిపుణులైన శిల్పులతో దీనిని తయారు చేయించామన్నారు. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ఈ దివ్య కిరీటాన్ని అలంకరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.